16వ శతాబ్దిలో శ్రీ తులసీ దాసు గారి చే వ్రాయబడిన హనుమాన్ చాలీసా అప్రతిహాతంగా, గంగా తరంగ ప్రవాహిలా సీతారాముల, గౌరీశంకరుల ఆశిస్సులతో, నిరాఘాటంగా సాగిపోతున్నది. ఈ రోజు ఏ ఇంట్లో చూచినా, పసిపిల్లలు పాలు తాగాలన్న, నిద్ర పుచ్చాలన్నా హనుమాన్ చాలీసా ను వినిపించాల్సిందే, పిల్లాది మేర, ఆబాల గోపాలం మహిమాన్వితమైన హనుమాన్ చాలీసాకు ముగ్దులు కావలసిందే . కాని నేడు ప్రతి దేవీ దేవత లపై ఎన్నో చాలీసాలు రచింప బడినప్పటికీ హనుమాన్ చాలీసా అంత గొప్పగా ప్రాచుర్యం పొందలేదు. అటువంటి హనుమాన్ చాలీసాను సంత్ గోస్వామి తులసీదాసు అనంతరము ఎందరో మహానుభావులు ప్రజా బాహుళ్యం లోకి తీసుకొచ్చారు. అందరిని కాకపోయినప్పటికి, కనీసం కొందరినైనా ఈ సందర్భంలో తలుచుకోవటం సబబు అనిపించింది. వారిలో 1.శ్రీ అవదూతేంద్ర సరస్వతి గారు.2. శ్రీ జగద్గురు రామభద్రాచార్య గారు.3.శ్రీ యం.యస్. రామారావుగారు గురించి కొంత చెప్పుకోవటం సమంజసమనిపించి, ఈ గ్రంధంలో వీరి జీవిత చరిత్రలను సంక్షిప్తంగా రాయటం జరిగింది.హనుమాన్ చాలీసా యొక్క కథానాయకుడు శ్రీగోస్వామి తులసీ దాసు గారి చరిత్రను క్లుప్తంగా చెప్పటం జరిగింది.
RELIGION / Spirituality
శ్రీ హనుమాన్ చాలీసా మహాత్మ్యం (THE DEVOTE’S JOURNEY)
₹549.00
By: Ramaraju Lakshmi Chenna Kesavarao
ISBN: 9789366654515
Language: Telugu
Pages: 276
Format: Hardback
Category: SELF-HELP / Spiritual
Delivery Time: 7-9 Days





Reviews
There are no reviews yet.